Published on Oct 16, 2024
Government Jobs
ఈసీహెచ్‌ఎస్‌-సికింద్రాబాద్‌లో మెడికల్‌ పోస్టులు
ఈసీహెచ్‌ఎస్‌-సికింద్రాబాద్‌లో మెడికల్‌ పోస్టులు

సికింద్రాబాద్‌లోని ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కంట్రిబ్యూటరీ హెల్త్‌ స్కీమ్‌ స్టేషన్ (ఈసీహెచ్ఎస్‌) ఒప్పంద ప్రాతిపదికన మెడికల్‌, పారామెడికల్‌, నాన్ మెడికల్  పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 102

వివ‌రాలు:

1. ఓఐసీ పాలీక్లినిక్: 06
2. మెడికల్ స్పెషలిస్ట్: 03
3. మెడికల్ ఆఫీసర్: 24
4. గైనకాలజిస్ట్‌: 01
5. డెంటల్ ఆపీసర్: 08
6. డెంటల్ హైజనిస్ట్‌: 03
7. ఫార్మాసిస్ట్: 12
8. ల్యాబ్ టెక్నీషియన్: 07
9. ల్యాబ్ అసిస్టెంట్: 01
10. నర్సింగ్ అసిస్టెంట్‌: 03
11. ఫిజియోథెరపిస్ట్‌: 03
12. ఐటీ నెట్‌వర్క్ టెక్నీషియన్: 01
13. ఫిమేల్ అటెండెంట్: 02
14. చౌకీదార్‌: 06
15. డ్రైవర్: 05
16. సఫాయివాలా: 09
17. క్లర్క్: 05
18. డీఈఓ: 02
19. ప్యూన్: 01

అర్హత: ఎనిమిదో తరగతి, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, డిప్లొమా, బీఎస్సీ డిగ్రీ, ఎంబీబీఎస్‌/ బీడీఎస్‌/ బీఫార్మసీ/ జీఎన్‌ఎం /ఎండీ/ ఎంఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు ఓఐసీ పాలీక్లినిక్, మెడికల్ ఆఫీసర్, డెంటల్ ఆపీసర్ పోస్టులకు రూ.75,000; మెడికల్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్‌ పోస్టులకు రూ.1,00,000; టెక్నీషియన్, క్లర్క్, డీఈఓ, ప్యూన్, సఫాయివాలా, చౌకీదార్, అటెండెంట్ పోస్టులకు రూ.16,800; డ్రైవర్ పోస్టులకు రూ.19,700; మిగతా పోస్టులకు రూ.28,100.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, షార్ట్‌లిస్ట్, పని అనుభవం, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 20-10-2024.

Website: https://www.echs.gov.in/