Published on May 18, 2025
Government Jobs
ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వేలో టీచర్‌ పోస్టులు
ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వేలో టీచర్‌ పోస్టులు

ఈస్‌ కోస్ట్‌ రైల్వే, ఒడిశా ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో టీచర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టులు: 22

వివరాలు:

1. పీజీటీ: 03

2. టీజీటీ: 14

3. పీఎస్‌టీ: 01

4. పీఈటీ: 01

5. ఆర్ట్‌ & క్రాఫ్ట్‌: 01

6. లైబ్రేరియన్‌: 01

7. బాలవాటిక టీచర్: 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈడీ, డిప్లొమా, ఎంఏ, ఎంఎస్సీ, బీఈఎల్‌ఈడీ, డీఈఎల్‌ఈడీ, ఇంటర్‌, పీబీఈడీ, బీఎల్‌ఐబీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 09-05-2025 తేదీ నాటికి 18 - 65 ఏళ్లు ఉండాలి.

జీతం: నెలకు పీజీటీకి రూ.27,500, టీజీటీకి రూ.26,250, లైబ్రేరియన్‌కు రూ.26,250, పీఈటీకి రూ.26,250, ఆర్ట్ & క్రాఫ్ట్‌ టీచర్‌కు రూ.21,250, పీఎస్‌టీకి రూ.21,250, బాలవాటిక టీచర్‌కు రూ.21,250.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 2025 మే 30.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీలు: జూన్‌ 3, 4, 5.

వేదిక: మిక్స్‌డ్ హయ్యర్ సెకండరీ స్కూల్, జట్ని (రైల్వే స్టేషన్ దగ్గర), ఖుర్దా రోడ్, ఒడిశా.(ఉదయం 8.30 నుండి 10.00 వరకు)

Website: https://eastcoastrail.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0,1,1290,1296,1299