Published on Sep 25, 2024
Apprenticeship
ఈస్ట్రన్‌ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు
ఈస్ట్రన్‌ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు

కోల్‌కతాలోని ఈస్ట్రన్‌ రైల్వే- రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ) ఈస్ట్రన్‌ రైల్వే పరిధిలోని వర్క్‌షాప్‌లు, డివిజన్‌లలో యాక్ట్ అప్రెంటిస్‌ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 3,115

వివరాలు:

వర్క్‌షాప్‌/ డివిజన్లు: హౌరా డివిజన్, లిలుహ్ వర్క్‌షాప్, సీల్దా డివిజన్, కంచరపరా వర్క్‌షాప్, మాల్దా డివిజన్, అసన్‌సోల్ డివిజన్, జమాల్‌పుర్ వర్క్‌షాప్.

అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 

ట్రేడ్‌లు: ఫిట్టర్, వెల్డర్, మెకానిక్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, లైన్‌మ్యాన్, వైర్‌మ్యాన్, ఎలక్ట్రీషియన్, ఎంఎంటీఎం, సివిల్ ఇంజినీర్, టర్నర్, రిఫ్రిజిరేషన్ అండ్‌ ఎయిర్ కండిషనింగ్.

వయోపరిమితి: 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్‌, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు రుసుము: రూ.100.

ఆన్‌లైన్ దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ: 23-10-2024.

Website:https://rrcrecruit.co.in/ActAprt2425Vdt01/

Apply online:https://rrcrecruit.co.in/ActAprt2425Vdt01/gen_instructions_er.aspx