Published on Sep 18, 2024
Government Jobs
ఈసీజీసీ లిమిటెడ్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు
ఈసీజీసీ లిమిటెడ్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు

ముంబయిలోని ప్రభుత్వ రంగ సంస్థ- ఈసీజీసీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేడర్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

మొత్తం పోస్టులు: 

వివరాలు: 40 (ఎస్సీ- 6; ఎస్టీ- 4; ఓబీసీ- 11; ఈడబ్ల్యూఎస్‌- 3; అన్‌రిజర్వ్‌డ్- 16)

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ (గ్రాడ్యుయేషన్) లేదా తత్సమానమైన అర్హత కలిగి ఉండాలి.

వయోపరిమితి: 01.09.2024 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.53600-రూ.1,02,090.

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ పరీక్ష (ఆబ్జెక్టివ్ టెస్ట్), డిస్క్రిప్టివ్ పేపర్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా.

ఆబ్జెక్టివ్ టెస్ట్ (మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు) సబ్జెక్టులు: రీజనింగ్ ఎబిలిటీ (50 ప్రశ్నలు- 50 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), కంప్యూటర్ నాలెడ్జ్ (20 ప్రశ్నలు- 20 మార్కులు), జనరల్ అవేర్‌నెస్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (50 ప్రశ్నలు- 50 మార్కులు).

మొత్తం ప్రశ్నలు: 200. గరిష్ఠ మార్కులు: 200. పరీక్ష వ్యవధి: 140 నిమిషాలు.

దరఖాస్తు రుసుము: ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.175. ఇతరులలకు రూ.900.

ఆన్‌లైన్ దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ: 13.10.2024

ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ (నాన్-క్రీమీ లేయర్) అభ్యర్థులకు ప్రీ-ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ప్రారంభం: 28.10.2024 నుంచి.

ఆన్‌లైన్ రాత పరీక్ష కాల్ లెటర్‌ల డౌన్‌లోడ్ ప్రారంభం: 05.11.2024 నుంచి.

ఆన్‌లైన్ రాత పరీక్ష తేదీ: 16-11-2024.

రాత పరీక్ష ఫలితాల ప్రకటన తేదీలు: 16-12-2024 నుంచి 31-12-2024 మధ్య.

ఇంటర్వ్యూ తేదీలు: జనవరి/ ఫిబ్రవరి, 2025.

Website:https://www.ecgc.in/careers-with-ecgc.html

Apply online:https://ibpsonline.ibps.in/ecgcjul24/