హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటిటెడ్ (ఈసీఐఎల్) ఒప్పంద ప్రాతిపదికన కోల్‌కతా, ముంబయి, న్యూ దిల్లీ, చెన్నై జోన్‌లలో ప్రాజెక్ట్ ఇంజినీర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య - 23
వివరాలు:
1. ప్రాజెక్ట్ ఇంజినీర్: 15
2. అసిస్టెంట్ ప్రాజెక్టు ఇంజినీర్: 03
3. టెక్నికల్ ఆఫీసర్: 05
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, డిప్లొమాలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: పోస్టులను అనుసరించి 30 నుంచి 33 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు రూ.40,000 - రూ.55,000, టెక్నికల్ ఆఫీసర్‌కు రూ.25,000 - రూ.31,000, అసిస్టెంట్ ప్రాజెక్టు ఇంజినీర్‌కు రూ.25,506.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: 2025 డిసెంబర్ 16.
Website:https://www.ecil.co.in/jobs.html