హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటిటెడ్ (ఈసీఐఎల్) వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 80
వివరాలు:
విభాగాలు: ఈసీఈ/ఎలక్ట్రానిక్స్ & టెలీ కమ్యూనికేషన్, ఇనుస్ట్రుమెంటేషన్, సీఎస్‌ఈ/ఐటీ, మెకానికల్, ఈఈఈ/ఎలక్ట్రికల్, సివిల్, కెమికల్.
పోస్టు పేరు-ఖాళీలు
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 2025 ఏప్రిల్ 30వ తేదీ నాటికి 27 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు రూ.40,000 - రూ.1,40,000.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
పరీక్ష కేంద్రాలు: బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబయి, న్యూ దిల్లీ, కోల్‌కతా.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నాన్ రీఫండబుల్ ఫీజు రూ.1000. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేదీ: 2025 జూన్ 5 వరకు.
Website: https://www.ecil.co.in/jobs.html