హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటిటెడ్ ( ఈసీఐఎల్) వివిధ విభాగాల్లో ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: - 412
వివరాలు:
1. ఎలక్ట్రానిక్స్ మెకానిక్(ఈఎం): 95
2. ఫిట్టర్: 130
3. ఎలక్ట్రీషియన్: 61
4. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్(సీఓపీఏ): 51
5. మెకానిక్: 03
6. టర్నర్: 15
7. వెల్డర్: 22
8. మెషినిస్ట్: 12
9. మెషినిస్ట్(జి): 02
10. పెయింటర్: 09
11. కార్పెంటర్: 06
12. ప్లంబర్: 03
13. మెకానిక్ డ్రాఫ్ట్స్‌మెన్: 03
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐలో ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఎన్‌సీవీటీ సర్టిఫికేట్ ఉండాలి.
వయోపరిమితి: 2025 అక్టోబర్ 31వ తేదీ నాటికి 18 ఏళ్ల లోపు ఉండకూడదు. జనరల్ అభ్యర్థులకు 25 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 28 ఏళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 30 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
శిక్షణ వ్యవధి: 1 సంవత్సరం.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మెరిట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 సెప్టెంబర్ 22.