హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) కాంట్రాక్ట్ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న ఈసీఐఎల్ కేంద్రాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 61.
వివరాలు:
1. ప్రాజెక్ట్ ఇంజినీర్: 20 పోస్టులు
2. టెక్నికల్ ఆఫీసర్: 26 పోస్టులు
3. ఆఫీసర్: 02 పోస్టులు
4. అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ అండ్ అసిస్టెంట్ ఇంజినీర్: 13 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వేతనాలు: నెలకు ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు రూ.45,000 నుంచి రూ.55,000. టెక్నికల్ ఆఫీసర్/ ఆఫీసర్‌కు రూ.25,000 నుంచి రూ.31,000. అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు రూ.24,500 నుంచి రూ.30,000.
ప్రాజెక్ట్ లొకేషన్: ఈస్ట్ జోన్ (కోల్‌కతా), నార్త్ జోన్ (న్యూదిల్లీ), వెస్ట్ జోన్ (ముంబయి), హెడ్ క్వార్టర్స్ (హైదరాబాద్).
ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీలు: 04, 05, 07, 11-11-2024.
వేదిక: హైదరాబాద్, ముంబయి, న్యూదిల్లీ, కోల్‌కతాలోని ఈసీఐఎల్ కార్యాలయాల్లో.
Website:https://www.ecil.co.in/