ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ పథకం (ఈసీఎంఎస్) కింద రూ.41,863 కోట్ల పెట్టుబడితో తలపెట్టిన 22 నూతన ప్రతిపాదనలను ఆమోదించినట్లు ఎలక్ట్రానిక్స్-ఐటీ శాఖ 2025, జనవరి 2న తెలిపింది. ఇందువల్ల రూ.2,58,152 కోట్ల విలువైన ఉత్పత్తులు తయారవుతాయని, 33,791 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించింది. గతంలో రూ.12,704 కోట్ల పెట్టుబడి అంచనాలతో 24 ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.