Published on Mar 25, 2025
Private Jobs
ఈనాడు జర్నలిజం స్కూలులో ప్రవేశాలు
ఈనాడు జర్నలిజం స్కూలులో ప్రవేశాలు

ఈనాడు జర్నలిజం స్కూలులో ప్రవేశాలు

అక్షరానికి సామాజిక ప్రయోజనం కలిగించే పాత్రికేయ వృత్తిలో చేరాలనుకుంటున్నారా? సమాజాభివృద్ధి పట్ల ఆకాంక్ష, భాష మీద పట్టు మీకు ఉంటే, ఈ ప్రకటన కచ్చితంగా మీ కోసమే.

కొత్త తరం పాత్రికేయుల్ని తీర్చిదిద్దటం కోసం మల్టీమీడియా, టెలివిజన్, మొబైల్‌ జర్నలిజం విభాగాల్లో పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తుంది.

ఎంపిక:

మొదట వివిధ అంశాల మీద రాత పరీక్షలు జరుగుతాయి.

తెలుగు, ఇంగ్లిషు భాషల్లో ప్రావీణ్యాన్నీ, అనువాద సామర్థ్యాన్నీ, వర్తమాన వ్యవహారాల్లో పరిజ్ఞానాన్నీ పరీక్షించే లఘు, వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి.

తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఈనాడు ప్రచురణ కేంద్రాల్లోనూ ఈ పరీక్షలు జరుగుతాయి.

వీటిలో ఉత్తీర్ణులైన వారికి బృందచర్చలు, ఇంటర్వ్యూలు ఉంటాయి. సంస్థ నియమ నిబంధనలకు లోబడి తుది ఎంపిక ఉంటుంది.

శిక్షణ, భృతి:

ఈనాడు జర్నలిజం స్కూలులో ఏడాది శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో మొదటి ఆరు నెలలు రూ.14,000, తరువాతి ఆరు నెలలు రూ.15,000 చొప్పున నెలవారీ భృతి లభిస్తుంది.

ఉద్యోగంలో:

స్కూల్లో కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు ట్రెయినీలుగా అవకాశం లభిస్తుంది.

ఏడాది పాటు జరిగే ఈ శిక్షణలో రూ.20,000 జీతం ఉంటుంది.

అది పూర్తయ్యాక, శిక్షణార్థుల వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా ఒక ఏడాది ప్రొబేషన్‌లో రూ.22,000 వరకూ, ఆ తరువాత కన్ఫర్మేషన్‌లో రూ.24,000 వరకూ జీతభత్యాలు ఉంటాయి.

దరఖాస్తు విధానం:

దరఖాస్తు ఆన్‌లైన్‌లో మాత్రమే చేయాలి. దరఖాస్తు రుసుము రూ.200 ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. దరఖాస్తు ధ్రువీకరణ నకలును అభ్యర్థులు తమ వద్ద తప్పనిసరిగా ఉంచుకోవాలి.

ఒప్పంద పత్రం:

స్కూల్లో చేరిన అభ్యర్థులు ఏడాది తదనంతర శిక్షణతో కలిపి రామోజీ గ్రూపు సంస్థల్లో 3 సంవత్సరాలు విధిగా పనిచేయాలి. ఈ మేరకు కోర్సు ప్రారంభంలోనే ఒప్పంద పత్రాన్ని సమర్పించాలి.

గతంలో ఎంపికై కోర్సులో చేరనివారు మళ్లీ దరఖాస్తు చేయనవసరం లేదు.

అర్హతలు

తేట తెలుగులో రాయగల నేర్పు

ఆంగ్లభాషపై అవగాహన

లోకజ్ఞానం, వర్తమాన వ్యవహారాలపై పట్టు

ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడాలన్న తపన

మీడియాలో స్థిరపడాలన్న బలమైన ఆకాంక్ష

30.06.2025 నాటికి 28కి మించని వయసు

డిగ్రీ ఉత్తీర్ణత (చివరి సంవత్సరం పరీక్షలు రాసిన/ రాస్తున్న అభ్యర్థులూ అర్హులే)

ముఖ్య తేదీలు

నోటిఫికేషన్‌ : 23.03.2025

ఆన్‌లైన్లో దరఖాస్తుల సమర్పణకు గడువు : 22.04.2025

ప్రవేశ పరీక్ష : 11.05.2025

కోర్సు ప్రారంభం : 30.06.2025

Apply online: https://ejs.eenadu.net/