Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Dec 15, 2025
Walkins
ఈఎస్‌ఐసీ హైదరాబాద్‌లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఈఎస్‌ఐసీ హైదరాబాద్‌లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు

హైదరాబాద్ సనత్‌నగర్‌లోని  ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ)  ఒప్పంద ప్రాతిపదికన ఫ్యాకల్టీ (ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్), సీనియర్ రెసిడెంట్, మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య - 102

వివరాలు:

1. ఫ్యాకల్టీ (ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్) - 43

2. సీనియర్ రెసిడెంట్ - 44

3. మెడికల్ ఆఫీసర్ - 15

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్/ ఎండీ/ డీఎన్‌బీ/ఎంసీహెచ్‌/డీఎం ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 35 ఏళ్ల నుంచి 69 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం: నెలకు ఫ్యాకల్టీకు రూ.1,46,638- రూ.2,56,671, మెడికల్ ఆఫీసర్‌కు రూ.56,100 - రూ.1,17,103, సీనియర్ రెసిడెంట్ కు రూ. 67,700. 

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.500.ఎస్సీ,ఎస్టీ, పీడౠ్ల్యబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

ఇంటర్వ్యూ తేదీలు: 2025 డిసెంబరు 29 నుంచి 2026 జనవరి 7వ  తేదీ వరకు 

వేదిక: అకడమిక్ బ్లాక్, ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజ్, సనత్‌నగర్, హైదరాబాద్.

Website:https://mchyderabad.esic.gov.in/recruitments/medical_recruitment_list