Published on Dec 2, 2025
Walkins
ఈఎస్‌ఐసీ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
ఈఎస్‌ఐసీ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు

ఈఎస్‌ఐసీ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌, సనత్‌నగర్‌, హైదరాబాద్ ఒప్పంద ప్రాతిపదికన  ప్రొఫెసర్‌, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్‌ పొస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య - 45

వివరాలు:

1. ప్రొఫెసర్‌ - 05

2. అసోసియేట్ ప్రొఫెసర్ - 06

3. అసిస్టెంట్ ప్రొఫెసర్ - 12

4. సీనియర్‌ రెసిడెంట్‌ - 22

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో ఎండీ, ఎంఎస్‌, డీఎన్‌బీ, డీఎం/ఎంసీహెచ్‌ తదితర విద్యార్హతలు, ఉద్యోగానుభవం ఉండాలి.

విభాగాలు: కార్డియాలజీ, సీటీవీఎస్, అనస్థీషియా, సర్జికల్ ఎస్‌ఎస్‌తో అనస్థీటిస్ట్, యాక్సిడెంట్ & ఎమర్జెన్సీ, ఐసీయూ, రేడియాలజీ, యూరాలజీ, న్యూరో-సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, తదితర విభాగాలు...

గరిష్ఠ వయోపరిమితి: 45 ఏళ్లు నుంచి 69 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు ప్రొఫెసర్‌కు రూ.2,56,671. అసోసియేట్ ప్రొఫెసర్ కు రూ.1,70,681. . అసిస్టెంట్ ప్రొఫెసర్ కు రూ.1,46,638. సీనియర్ రెసిడెంట్ కు రూ.67,700.

ఇంటర్వ్యూ తేదీలు: 2025. డిసెంబరు 10, 11, 12, 15, 16.

వేదిక: కాన్ఫరెన్స్ హాల్, ఈఎస్‌ఐసీ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌, సనత్‌నగర్‌, హైదరాబాద్.

Website:https://esic.gov.in/recruitments