Published on Dec 27, 2025
Government Jobs
ఈఎస్‌ఐసీ రాంచిలో సీనియర్‌ రెసిడెంట్ ఉద్యోగాలు
ఈఎస్‌ఐసీ రాంచిలో సీనియర్‌ రెసిడెంట్ ఉద్యోగాలు

ఎంప్లాయిస్‌ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) రాంచి  ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ, నాన్‌ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య -  99

వివరాలు:

1. ప్రొఫెసర్ -  13

2. అసోసియేట్ ప్రొఫెసర్ -  17

3. అసిస్టెంట్ ప్రొఫెసర్ - 17

4. సీనియర్ రెసిడెంట్ - 52

విభాగాలు: అనాటమీ, బయోకెమిస్ట్రీ, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, డెంటల్, డెర్మటాలజీ, మెడికల్ ఆంకాలజీ, మైక్రోబయాలజీ, తదితరాలు.

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌ /ఎండీ/ఎంఎస్‌లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వయోపరిమితి: 45 ఏళ్ల నుంచి 69 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు ప్రొఫెసర్‌కు రూ.2,56,140.అసోసియేట్ ప్రొఫెసర్ కు రూ.1,65,945. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.1,43,345.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ,ఎస్టీ, పీడౠ్ల్యబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా

చిరునామా: డీన్ కార్యాలయం, ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్, రాంచీ, ఝార్ఖండ్.

దరఖాస్తు చివరి తేదీ: జనవరి 3, 2026.

Website:https://esic.gov.in/recruitments