రాంచిలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) మెడికల్ కాలేజీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో వివిధ విభాగాల్లో టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు: 40
వివరాలు:
1. ప్రొఫెసర్ - 05
2. అసోసియేట్ ప్రొఫెసర్ - 15
3. అసిస్టెంట్ ప్రొఫెసర్ - 20
విభాగాలు: అనస్థీషియాలజీ, బయోకెమిస్ట్రీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, ఇతర విభాగాలు ఉన్నాయి.
వేతనం: ఎంపికైన ప్రొఫెసర్లకు నెలకు రూ.2,22,543, అసోసియేట్ ప్రొఫెసర్లకు రూ.1,52,241, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు రూ.1,30,797 చొప్పున వేతనం అందుతుంది.
వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 69 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: కేవలం ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా మాత్రమే సమర్పించాలి.
దరఖాస్తు గడువు: ఆన్‌లైన్ దరఖాస్తుకు ఫిబ్రవరి 24, 2026 సాయంత్రం 06:00 గంటల వరకు అవకాశం ఉంది.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, పీహెచ్ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ.500.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 24.2.2026
Website:https://esic.gov.in/recruitments