Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 7, 2026
Walkins
ఈఎస్ఐసీ ముంబయిలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీ ముంబయిలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు

ముంబయిలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) మెడికల్ కాలేజీ  హాస్పిటల్, వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన వాక్-ఇన్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది.

వివరాలు:

సీనియర్ రెసిడెంట్  - 23 

విభాగాలు: అనస్థీషియాలజీ, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, జనరల్ సర్జరీ, అనాటమీ, ఫిజియాలజీ, తదితర విభాగాలు.

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్/ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 45 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు రూ.1,46,000.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

ఇంటర్వ్యూ తేదీలు: 2026 మార్చి 9, 10, 11, 12, 13.

వేదిక: ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీ, హాస్పిటల్, అంధేరి (ఈస్ట్), ముంబయి- 400093.

Website:https://esic.gov.in/recruitments