ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) ముంబయి ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 47
వివరాలు:
1. ప్రొఫెసర్: 15
2. అసోసియేట్ ప్రొఫెసర్: 21
3. అసిస్టెంట్ ప్రొఫెసర్: 11
విభాగాలు: అనస్థీషియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, మెడిసిన్, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, రేడియాలజీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ తదితర విభాగాలు...
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి 69 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ,ఎస్టీ మహిళా అభ్యర్థులకు రూ.125. ఇతరులకు రూ.300.
ఇంటర్వ్యూ తేదీలు: 2026 ఏప్రిల్ 7, 8, 9.
వేదిక: డీన్ ఆఫీస్, ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీ, హాస్పిటల్, సెంట్రల్ రోడ్, ఎంఐడీసీ, అంధేరీ ఈస్ట్ ముంబయి - 400093.
Website:https://esic.gov.in/recruitments