Published on Dec 18, 2025
Walkins
ఈఎస్‌ఐసీ నొయిడాలో ప్రొఫెసర్‌ పోస్టులు
ఈఎస్‌ఐసీ నొయిడాలో ప్రొఫెసర్‌ పోస్టులు

ఎంప్లాయిస్‌ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) నొయిడా ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

మొత్తం వస్టుల సంఖ్య: 21

వివరాలు:

1. ప్రొఫెసర్‌: 08

2. అసోసియేట్ ప్రొఫెసర్‌: 11

3. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌: 02

విభాగాలు: అనాటమీ, ఫిజియాలజీ, ఫారెన్సిక్‌ మెడిసిన్‌, కమ్యునిటీ మెడిసిన్‌, కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజమ్‌, గ్యాస్ట్రోఎంటరాలజీ, మెడికల్ ఆంకాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, యూరాలజీ.

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ, ఎండీ లేదా డీఎన్‌బీ, ఎంఎస్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి 67 ఏళ్లు మించకూడదు. 

జీతం: నెలకు ప్రొఫెసర్‌కు రూ.2,22,543, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,47,986, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.1,27,141.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: 2025 డిసెంబర్‌ 24.

Website:https://esic.gov.in/