Published on Jun 15, 2025
Government Jobs
ఈఎస్‌ఐసీ గువాహటి హాస్పిటల్‌లో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు
ఈఎస్‌ఐసీ గువాహటి హాస్పిటల్‌లో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు

అస్సాం రాష్ట్రం గువాహటిలోని ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్‌సూరెన్స్‌ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) హాస్పిటల్‌ ఒప్పంద ప్రాతిపదికన ఫ్యాకల్టీ, నాన్‌ ఫ్యాకల్టీ ఖాళీల భర్తీకి  దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 66

వివరాలు:

1. ప్రొఫెసర్‌: 09

2. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌: 16

3. అసోసియేట్‌ ప్రొఫెసర్‌: 13

4. సీనియర్‌ రెసిడెంట్‌ (అకాడమిక్‌/ నాన్‌ అకాడమిక్‌): 28 

 విభాగాలు: అనాటమీ, సైకాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, పీడీయాట్రిక్‌, డెర్మటాలజీ, సైకియాట్రీ, ఆర్థోపెడిక్స్‌, ఈఎన్‌టీ, రేడియోడయాగ్నసిస్‌, డెర్మటాలజీ తదితరాలు

అర్హత: సంబంధిత విభాగంలో డీఎన్‌బీ, ఎంస్‌/ ఎండీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు ప్రొఫెసర్‌కు రూ.2, 11,878, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు రూ.1,40,894, అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు రూ.1,21,408, సీనియర్‌ రెసిడెంట్‌కు రూ.67,700.

వయోపరిమితి: టీచింగ్‌ ఖాళీలకు 69 ఏళ్లు; సీనియర్‌ రెసిడెంట్‌ ఖాళీలకు 45 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు చివరి తేదీ: 22-06-2025.

Website: http://https//www.esic.gov.in/