Published on Dec 20, 2024
Government Jobs
ఈఎస్‌ఐసీ ఆసుపత్రుల్లో ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు
ఈఎస్‌ఐసీ ఆసుపత్రుల్లో ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు

న్యూదిల్లీలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ), హెడ్ క్వార్టర్స్ దేశ వ్యాప్తంగా ఉన్న ఈఎస్‌ఐసీ డిస్పెన్సరీలు/ ఆసుపత్రుల్లో ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్-II పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 608 (యూఆర్‌- 254, ఎస్సీ- 63, ఎస్టీ- 53, ఓబీసీ- 178, ఈడబ్ల్యూఎస్‌- 60)

వివరాలు:

అర్హత: ఎంబీబీఎస్‌ డిగ్రీ అర్హతతో పాటు రొటేటింగ్ ఇంటర్న్‌షిప్ పూర్తయి ఉండాలి. యూపీఎస్సీ నిర్వహించే కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్-2022/ 2023 డిస్‌క్లోజర్ లిస్టులో ఎంపికైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

పే స్కేల్: రూ.56,100-1,77,500.

వయోపరిమితి: 26.04.2022 నాటికి 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: యూపీఎస్సీ నిర్వహించే కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్-2022/ 2023 ఫలితాల్లో ప్రతిభ, రిజర్వేషన్‌ ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31-01-2025.

Website:https://www.esic.gov.in/recruitments

Apply online:https://www.esic.in/InsuranceGlobalWebV16/ESICRecruitmentMO_G2/Login.aspx