హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 31
వివరాలు:
1. సూపర్ స్పెషలిస్ట్/ సీనియర్ కన్సల్టెంట్: 04
2. జూనియర్ కన్సల్టెంట్: 03
3. స్పెషలిస్ట్ (జూనియర్): 04
4. అసోసియేట్ ప్రొఫెసర్: 01
5. సీనియర్ రెసిడెంట్: 19
విభాగాలు: అనస్తీషియా, న్యూరాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, న్యూరో సర్జరీ, పాథాలజీ, సైకియాట్రీ, రేడియోలజీ, కార్డియాలజీ, సీటీవీఎస్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్/ఎండీ/ఎంఎస్, పీజీ (డీఎం/డీఎన్‌బీ)ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: సీనియర్/ జూనియర్ కన్సల్టెంట్ పోస్టులకు 74 ఏళ్లు; సీనియర్/జూనియర్ స్పెషలిస్ట్ పోస్టులకు 69 ఏళ్లు; సీనియర్ రెసిడెంట్ పోస్టులకు 45 ఏళ్లు; మిగతా పోస్టులకు 45 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు సూపర్ స్పెషలిస్ట్ పోస్టులకు రూ.2,40,000; జూనియర్ కన్సల్టెంట్ పోస్టులకు రూ.2,00,000; స్పెషలిస్ట్ జూనియర్ పోస్టులకు రూ.1,42,000; అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ.1,65,953; సీనియర్ రెసిడెంట్ పోస్టులకు రూ.67,700.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీలు: 18, 19, 20, 21, 22-11-2024.
వేదిక: చాంబర్ ఆఫ్ మెడికల్ సూపరింటెండెంట్, ఈఎస్ఐసీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సనత్‌నగర్, హైదరాబాద్.
Website:https://www.esic.gov.in/