Published on Aug 23, 2025
Walkins
ఈఎస్‌ఐసీలో ముంబయిలో ఉద్యోగాలు
ఈఎస్‌ఐసీలో ముంబయిలో ఉద్యోగాలు

ఎంప్లాయిస్‌ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) ముంబయి ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

వివరాలు:

1.సీనియర్ రెసిడెంట్ 18

విభాగాలు: సర్జరీ,ఆర్థోపెడిక్స్, డెంటిస్ట్రీ, నియోనాటాలజీ, పీడియాట్రిక్స్, ఫార్మకాలజీ, డెర్మటాలజీ, సైకియాట్రీ ,అనాటమీ, ఫిజియాలజీ,బయోకెమిస్ట్రీ, ఫోరెన్సిక్, మెడిసిన్, క్యాజువాలిటీ, అబ్స్టెట్రిక్స్ ,గైనకాలజీ.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎండీ/డీఎన్‌బీ/పీజీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి 45 ఏళ్లు. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతం: నెలకు రూ.67,700. 

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీలు: 2025 ఆగస్టు 25, 26.

వేదిక: అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, 5వ అంతస్తు, ఈఎస్ఐసీ హాస్పిటల్ ప్రాంగణం, కాండివలి, అక్రూలి రోడ్, కాండివలి ఈస్ట్, ముంబయి - 400101.

Website:https://esic.gov.in/recruitments