Published on Sep 19, 2024
Government Jobs
ఇస్రో- హెచ్ఎస్ఎఫ్‌సీలో ఉద్యోగాలు
ఇస్రో- హెచ్ఎస్ఎఫ్‌సీలో ఉద్యోగాలు

ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)కు చెందిన బెంగళూరులోని హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ (హెచ్ఎస్ఎఫ్‌సీ) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 103

వివరాలు:

1. మెడికల్ ఆఫీసర్ (ఎస్‌డీ/ఎస్‌సీ): 03

2. సైంటిస్ట్/ ఇంజినీర్- ఎస్‌సీ: 10

3. టెక్నికల్ అసిస్టెంట్: 28

4. సైంటిఫిక్ అసిస్టెంట్: 01

5. టెక్నీషియన్-బి: 43

6. డ్రాఫ్ట్స్‌మ్యాన్: 13

7. అసిస్టెంట్ (రాజ్‌ భాష): 05

అర్హత: పదో తరగతి, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా, బీఎస్సీ డిగ్రీ, బీఈ/బీటెక్ (సివిల్/మెకానికల్/ ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రికల్), ఎంబీబీఎస్/ఎండీ, ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: అసిస్టెంట్ పోస్టులకు 28 ఏళ్లు; మిగతా పోస్టులకు 18 నుంచి 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, స్క్రీనింగ్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 09-10-2024.

Website:https://www.hsfc.gov.in/HSFCRecruitment