Published on Mar 29, 2025
Apprenticeship
ఇస్రో బెంగళూరులో అప్రెంటిస్ పోస్టులు
ఇస్రో బెంగళూరులో అప్రెంటిస్ పోస్టులు

బెంగళూరులోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)- 2025-26 సంవత్సరానికి గ్రాడ్యుయేట్/ డిప్లొమా అండ్‌ ట్రేడ్‌ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 75.

వివరాలు:

1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 46 

2. డిప్లొమా అప్రెంటిస్‌ ట్రైనింగ్‌/ డిప్లొమా ఇన్‌ కమర్షియల్‌ ప్రాక్టీస్‌: 15

3. ట్రేడ్‌ అప్రెంటిస్‌: 14 

గ్రాడ్యుయేట్ విభాగాలు: మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌, లైబ్రరీ సైన్స్‌.  డిప్లొమా విభాగాలు: మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్,  కమర్షియల్‌ ప్రాక్టీస్‌. 

ట్రేడ్‌ విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌, మెషినిస్ట్‌, ఫిట్టర్‌, వెల్డర్‌. 

రిజియన్‌లు: సదరన్‌ రీజియన్‌, నర్తన్‌ రీజియన్‌, ఈస్ట్రన్‌ రీజియన్‌.

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌, ఎంఎల్‌ఐఎస్సీ, ఇంజినీరింగ్‌ డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 

స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.9000; డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.8000; ఐటీఐ అప్రెంటిస్‌కు రూ.7000.

ఎంపిక ప్రక్రియ: దరఖాస్తుల స్క్రీనింగ్‌, డాక్యూమెంట్‌ వెరిఫికేషన్‌/ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీలు: ఏప్రిల్‌ 29, 30; మే 14, 15, 20, 21. 

వేదిక:

1. ఐఎస్‌టీఆర్‌ఏసీ బెంగళూరు ప్లాట్‌ 12 అండ్‌ 13, 3వ మెయిన్‌, రెండో ఫేస్‌, పీన్య ఇండస్ట్రియల్‌ ఏరియా, బెంగళూరు.

2. ఐఎస్‌టీఆర్‌ఏసీ లఖ్‌నవూ సెక్టార్‌-జి, జానకిపురం, కుర్సిరోడ్‌, లఖ్‌నవూ.

3. ఐఎస్‌టీఆర్‌ఏసీ, శ్రీ విజయపురం డోలిగుంజ్‌, శ్రీ విజయపురం, అండమాన్‌ అండ్‌ నికోబార్‌ ఐస్‌ల్యాండ్స్‌.

Website:https://www.isro.gov.in/Careers.html