బెంగళూరులోని ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) సైంటిస్ట్/ ఇంజినీర్ ‘ఎస్‌సీ’ గ్రూప్ ఏ గేజిటెడేడ్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 320
వివరాలు:
1. సైంటిస్ట్/ ఇంజినీర్-ఎస్సీ(ఎలక్ట్రానిక్స్): 113 పోస్టులు
2. సైంటిస్ట్/ ఇంజినీర్-ఎస్సీ(మెకానికల్): 160 పోస్టులు
3. సైంటిఫిక్ ఇంజినీర్- ఎస్సీ (కంప్యూటర్ సైన్స్): 44 పోస్టులు
4. సైంటిఫిక్ ఇంజినీర్- ఎస్సీ (ఎలక్ట్రానిక్స్)-పీఆర్‌ఎల్: 02 పోస్టులు
5. సైంటిఫిక్ ఇంజినీర్- ఎస్సీ (కంప్యూటర్ సైన్స్)-పీఆర్‌ఎల్: 01 పోస్టు
అర్హత: కనీసం 65 శాతం మార్కులతో ఎలక్ట్రానిక్స్/మెకానికల్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో బీఈ/ బీటెక్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 16.06.2025 నాటికి 28 ఏళ్లు మించకూడదు.
బేసిక్ పే: నెలకు రూ.56,100.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.
పరీక్ష కేంద్రాలు: అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, చెన్నై, గువాహటి, హైదరాబాద్, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబయి, న్యూదిల్లీ, తిరువనంతపురం.
దరఖాస్తు ఫీజు: రూ.250.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 16-06-2025.
Website:https://www.isro.gov.in/
Apply online:https://apps.ursc.gov.in/CentralBE-2025A/advt.jsp