ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) సైంటిస్ట్/ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 63
వివరాలు:
1. సైంటిస్ట్/ఇంజినీర్(ఎలక్ట్రానిక్స్): 22
2. సైంటిస్ట్/ఇంజినీర్(మెకానికల్): 33
3. సైంటిస్ట్/ఇంజినీర్(కంప్యూటర్ సైన్స్): 08
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్(మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సీఎస్), గేట్‌లో ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 28 ఏళ్లు.
జీతం: నెలకు రూ.56,100.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.250.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 మే 19.