హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్ ప్రపంచకప్ షూటింగ్‌లో స్వర్ణం నెగ్గింది. 2025, సెప్టెంబరు 13న నింగ్బో (చైనా)లో జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో మొత్తంగా 242.6 పాయింట్లు స్కోరు చేసి ఆమె మొదటి స్థానంలో నిలిచింది. చైనాకు చెందిన యావో కిన్‌గ్జున్ (242.5) రెండో స్థానంలో ఉంది. యెజిన్ (కొరియా, 220.7) మూడో స్థానాన్ని దక్కించుకుంది.