ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఆయతుల్లా మొజ్తాబా ఖమేనీ 2026, మార్చి 9న ఎన్నికయ్యారు. ఇటీవల అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన ఆయతుల్లా అలీ ఖమేనీ రెండో కుమారుడే ఈయన. మొజ్తాబాకు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్‌తో (ఐఆర్‌జీసీ), సైన్యంతో బలమైన సంబంధాలున్నాయి. ఇరాన్‌లో ఇస్లామిక్ విప్లవానికి పదేళ్ల ముందు (1969).. మషాద్ నగరంలో మొజ్తాబా జన్మించారు. 17 ఏళ్ల వయసులోనే ఇరాన్-ఇరాక్ యుద్ధంలో పాల్గొన్నారు.
ఇరాన్‌లో అత్యంత శక్తిమంతమైన బలగం- ఐఆర్‌జీసీ. ఇరాక్‌తో యుద్ధంలో ఐఆర్‌జీసీ విభాగమైన హబిబ్ ఇబన్ మజహిర్ బెటాలియన్‌లో భాగంగా మొజ్తాబా పోరాడారు. అప్పట్నుంచి ఆ దళంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.