Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 19, 2026
Government Jobs
ఇర్కాన్‌లో వర్క్స్‌ ఇంజినీర్ ఉద్యోగాలు
ఇర్కాన్‌లో వర్క్స్‌ ఇంజినీర్ ఉద్యోగాలు

రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని నవరత్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (ఇర్కాన్‌), కాంట్రాక్ట్ ప్రాతిపదికన 'వర్క్స్ ఇంజనీర్' పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. 

వివరాలు:

వర్క్స్‌ ఇంజినీర్‌(సివిల్‌/ఎలక్ట్రికల్/ఎస్‌ అండ్ టీ): 13

విద్యార్హత: సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో కనీసం 60% మార్కులతో ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

అనుభవం: సంబంధిత ఫీల్డ్‌లో కనీసం ఒక ఏడాది అనుభవం ఉండాలి.

వయోపరిమితి: గరిష్టంగా 30 ఏళ్లు (01.02.2026 నాటికి). ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

వేతనం: నెలకు రూ.36,000 స్థిర వేతనంతో పాటు ప్రతి ఏటా 5% ఇంక్రిమెంట్ ఉంటుంది.

దరఖాస్తు విధానం:

అభ్యర్థులు ముందుగా www.ircon.org వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత దరఖాస్తు ఫారాన్ని ప్రింట్ తీసి, దానికి గెజిటెడ్ సంతకం ఉన్న అవసరమైన ధృవపత్రాల కాపీలను జతచేసి, న్యూదిల్లీలోని ఇర్కాన్ కార్పొరేట్ కార్యాలయానికి (JGM/HRM, IRCON International Limited, Saket, New Delhi) పోస్ట్ ద్వారా పంపాలి. రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 18.02.2026.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 13.03.2026.

హార్డ్ కాపీ సమర్పించడానికి చివరి తేదీ: 20.03.2026.

Website:https://ircon.org/career-ircon/contract-employment