న్యూదిల్లీలోని ఇండియన్ రైల్వే కన్‌స్ట్రక్షన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (ఇర్కాన్) రెగ్యులర్ ప్రాతిపదికన జనరల్ మేనేజర్ పోస్టులు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు: 5
వివరాలు:
1. డిప్యూటీ జనరల్ మేనేజర్/ సివిల్- 01
2. మేనేజర్/ ఫైనాన్స్- 02
3. డిప్యూటీ మేనేజర్/ ఫైనాన్స్- 02
అర్హత: సీఏ/ సీఏంఏ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
వయోపరిమితి: డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు 41 ఏళ్లు; మేనేజర్‌కు 37 ఏళ్లు; డిప్యూటీ మేనేజర్‌కు 33 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు రూ.70,000 నుంచి రూ.2,00,000. మేనేజర్‌కు రూ.60,000- రూ.1,80,000; డిప్యూటీ మేనేజర్‌కు రూ.50,000- రూ.1,60,000.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: యూఆర్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.1000; ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్/ ఎక్స్-సర్వీస్‌మెన్ వారికి ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: జేజీఎం/ హెచ్‌ఆర్‌ఎం, ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, సీ-4, డిస్ట్రిక్ట్ సెంటర్, సాకేత్, దిల్లీ.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 15.02.2025.
దరఖాస్తు చివరి తేదీ: 07.03.2025.