Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Jan 31, 2026
Apprenticeship
ఇర్కాన్‌లో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులు
ఇర్కాన్‌లో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులు

ఇర్కాన్‌ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (ఇర్కాన్‌) వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 26

వివరాలు:

1. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 17

2. డిప్లొమా అప్రెంటిస్‌: 09

విభాగాలు:  సివిల్, ఎలక్ట్రికల్, ఎస్‌&టీ

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ(ఇంజినీరింగ్‌), డిప్లొమాలో ఉండాలి.

వయోపరిమితి: 2026 జనవరి 1వ తేదీ నాటికి 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

స్టైపెండ్‌: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.10,000, డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.8,500.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 17. 

Website:https://ircon.org/career-ircon/apprentice-under-act