గోవా రాజధాని నగరం పణజీలోని డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో 2024, నవంబరు 20న 55వ భారతీయ అంతర్జాతీయ సినిమా పండుగ (ఇఫ్ఫీ) ప్రారంభమైంది.
భారత చలనచిత్ర రంగ ప్రముఖులైన అక్కినేని నాగేశ్వరరావు, రాజ్‌కపూర్, మహమ్మద్ రఫీ, తపన్‌సిన్హాల శత జయంతుల సందర్భంగా వారి పేరిట స్మారక తపాలా బిళ్లలను విడుదల చేశారు.