Published on Oct 17, 2025
Current Affairs
‘ఇన్‌టూ ది లైట్‌ ఇండెక్స్‌ 2025’
‘ఇన్‌టూ ది లైట్‌ ఇండెక్స్‌ 2025’

దక్షిణ ఆసియా దేశాల్లో చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులపై ఇటీవల ‘ఇన్‌టూ ది లైట్‌ ఇండెక్స్‌ 2025’ అనే నివేదిక విడుదలైంది.

హిడెన్‌బర్గ్‌ విశ్వవిద్యాలయం, న్యూ సౌత్‌ వేల్స్‌ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని ‘చైల్డ్‌లైట్‌ గ్లోబల్‌ చైల్డ్‌ సేఫ్టీ ఇన్‌స్టిట్యూట్‌’ అనే సంస్థ దీన్ని విడుదల చేసింది. 

దీని ప్రకారం...భారత్, నేపాల్, శ్రీలంక దేశాల్లో ప్రతి ఎనిమిది మంది చిన్నారుల్లో ఒకరు (12.5శాతం) లైంగిక వేధింపులకు గురవుతున్నారు.

భారత్‌లో 2017-2022 మధ్య కాలంలో చిన్నారులపై లైంగిక నేరాల కేసులు 94 శాతం మేర అధికమైనట్లు నివేదిక పేర్కొంది.