మహా సముద్రాల వాతావరణ సమాచారాన్ని పది రోజుల ముందే గుర్తించే వ్యవస్థను హైదరాబాద్‌లోని ఇన్‌కాయిస్ (భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవాకేంద్రం) అదుబాటులోకి తెచ్చింది.
2025, ఫిబ్రవరి 3న ఇన్‌కాయిస్ 26వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా డైరెక్టర్ బాలకృష్ణన్ నాయర్ రెండు కొత్త సేవలను ప్రారంభించారు.
ప్రస్తుతం ఇన్‌కాయిస్ అయిదు రోజుల ముందు సముద్ర వాతావరణ సమాచారాన్ని ప్రకటిస్తుండగా దాన్ని పది రోజులకు పెంచుతూ రూపొందించిన ఇగోరా-1 (ఇన్‌కాయిస్ గ్లోబల్ ఓషన్ రీఎనాలసిస్) మొదటి దశ సేవలు ప్రారంభమయ్యాయి.
ఇప్పటివరకు అమెరికా, యూరోపియన్ యూనియన్(ఈయూ) ఆధ్వర్యంలో ఈ తరహా పరిశోధన సంస్థలుండగా వాటి సరసన భారత్ స్థానం దక్కించుకుంది.
పశ్చిమబెంగాల్ మత్స్యకారులకు పులస చేపల వేట లాభదాయకంగా ఉండేలా సమాచారం అందించే సేవను కూడా శాస్త్రవేత్తలు ప్రారంభించారు.
తర్వాతి దశల్లో ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మత్స్యకారులకూ ఈ సమాచారాన్ని చేరవేస్తామని ఇన్‌కాయిస్ తెలిపింది.