తెలంగాణ రాష్ట్రానికి ప్రతిష్ఠాత్మక జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు (ఎన్‌ఈసీఏ) లభించింది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) ఏటా ఇచ్చే జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డుల్లో 2025 సంవత్సరానికి తెలంగాణకు ద్వితీయ పురస్కారం దక్కింది.
2025, డిసెంబరు 14న దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులమీదుగా తెలంగాణ రాష్ట్ర ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిత్తల్ ఈ అవార్డును అందుకున్నారు.