భారత్‌లో రేసింగ్‌కు చిరునామాగా నిలిచిన ఇందు చందోక్ 2024, డిసెంబరు 7న కన్నుమూశారు.
ఆయన వయసు 93 ఏళ్లు. కోల్‌కతాలో పుట్టిన ఇందు.. మద్రాస్‌కు వలస వచ్చి 1953లో మద్రాస్ మోటర్ స్పోర్ట్స్ క్లబ్‌ను స్థాపించారు.
1971లో భారత మోటార్ స్పోర్ట్స్ క్లబ్ (ఎఫ్‌ఎంఎస్‌సీఐ) స్థాపనలోనూ కీలకపాత్ర పోషించారు.
1978 నుంచి 1979 వరకు ఎఫ్‌ఎంఎస్‌సీఐకి అధ్యక్షులుగా వ్యవహరించారు.
మద్రాస్‌కు దగ్గరలోని శ్రీపెరంబదూర్‌లో అంతర్జాతీయ ట్రాక్‌ను కూడా ఏర్పాటు చేశారు.