చిలీ మాజీ అధ్యక్షురాలు, మానవ హక్కుల కోసం పోరాటం చేసిన ప్రముఖురాలు మిచెల్ బచులెట్ ఈ ఏడాది (2024) ఇందిరా గాంధీ శాంతి పురస్కారానికి ఎంపికయ్యారు.
ఈ మేరకు జాతీయ భద్రతా మాజీ సలహాదారు శివశంకర్ మీనన్ అధ్యక్షతన ఏర్పాటైన అంతర్జాతీయ జ్యూరీ ఎంపిక చేసినట్లు ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ 2024, డిసెంబరు 6న తెలిపింది.
మిచెల్ గతంలో ఐక్యరాజ్య సమితిలో మహిళా విభాగ వ్యవస్థాపక డైరెక్టర్‌గా, మానవ హక్కుల విభాగానికి హై కమిషనర్‌గా పనిచేశారు.