Published on Dec 4, 2025
Current Affairs
‘ఇంద్రధనుస్సు’
‘ఇంద్రధనుస్సు’
  • విజయవాడలో 2025 డిసెంబరు 3న నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దివ్యాంగుల కోసం ‘ఇంద్రధనుస్సు’ పేరుతో 7 వరాలను ప్రకటించారు.
  • ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని భరోసా ఇచ్చారు. 
  • స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు-పబ్లిక్‌ సెక్టార్‌ ఎంటర్‌ప్రైజెస్‌లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధిని నామినేట్‌ చేస్తామని వెల్లడించారు. ఎన్నికల్లో ఎవరూ గెలవకపోతే ఎక్స్‌అఫీషియో మెంబర్‌ పదవిని కేటాయిస్తామన్నారు. 
  • ‘దివ్యాంగులకు ప్రత్యేక ఆర్థిక రాయితీ రుణ పథకాన్ని పునరుద్ధరిస్తామని ప్రకటించారు. ఇందుకు రూ.19 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. 
  • శాప్‌ ద్వారా అన్ని క్రీడా కార్యక్రమాలు, టాలెంట్‌ డెవలప్‌మెంట్‌ పథకాలను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. 
  • బహుళ అంతస్తుల ప్రభుత్వ గృహనిర్మాణ ప్రాజెక్టుల్లో దివ్యాంగులకు గ్రౌండ్‌ ఫ్లోర్‌లోనే ఇళ్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. 
  • వినికిడి లోపం ఉన్న వారికి బాపట్లలో ప్రత్యేక డిగ్రీ కళాశాల ఏర్పాటుతోపాటు.. గురుకుల పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాల్లో చదివే దివ్యాంగ విద్యార్థులకు అక్కడే సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ చేస్తామని చెప్పారు. 
  • అన్ని జిల్లాలతోపాటు అమరావతిలో దివ్యాంగులకు ప్రత్యేకంగా ‘దివ్యాంగ భవన్‌’లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.