దేశంలోనే మొదటి యాంటీ డ్రోన్ గస్తీ వాహనం ‘ఇంద్రజాల్ రేంజర్’ను హైదరాబాద్‌లోని రాయదుర్గంలో ఉన్న టీ హబ్‌లో 2025, నవంబరు 26న ఆవిష్కరించారు. భారత ఆర్మీ విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ దేవేంద్ర ప్రతాప్ పాండే, ఇంద్రజాల్ సంస్థ వ్యవస్థాపకుడు కిరణ్ రాజు దీన్ని విడుదల చేశారు. ఇంద్రజాల్ డ్రోన్ డిఫెన్స్ ఇండియా ఆధ్వర్యంలో ఈ వాహనాన్ని రూపొందించారు.
దేశ సరిహద్దులు, బహిరంగ ప్రదేశాలు, జనసమ్మర్థ స్థలాలు, డ్రోన్ దాడి ముప్పు పొంచి ఉన్న ప్రాంతాలపై ఇది నిఘా పెడుతుంది.