రక్షణ డ్రోన్ల కంపెనీ అయిన ఇంద్రజాల్ కొత్తగా ‘ఇంద్రజాల్ ఇన్‌ఫ్రా’ అనే వినూత్న రక్షణ కవచాన్ని ఆవిష్కరించింది.
అణు విద్యుత్ కేంద్రాలు, విమానాశ్రయాలు, ఆయిల్ రిఫైనరీలు, నౌకాశ్రయాలు, విద్యుత్ గ్రిడ్ లాంటి కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను డ్రోన్ల దాడుల నుంచి రక్షించడానికి దీన్ని వినియోగిస్తారు.
ఇంద్రజాల్‌కు చెందిన అత్యంత అధునాతన ‘స్కైయోస్’ ప్లాట్‌ఫామ్ ఆధారంగా దీన్ని రూపొందించారు.
దాదాపు 4,000 చదరపు కిలోమీటర్ల పరిధిలో రక్షణ కవచాన్ని ఇంద్రజాల్ రూపొందించగలుగుతుంది.