ఇజ్రాయెల్-పాలస్తీనా ప్రజల మధ్య స్నేహాన్ని పెంపొందించడానికి జీవితాలను అంకితం చేసిన డానియెల్ బారెన్‌బొయిమ్, అలీ అబు అవ్వాద్‌లకు 2023 ఏడాది ఇందిరాగాంధీ శాంతి పురస్కారాన్ని ప్రదానం చేశారు.
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్.ఠాకుర్ నేతృత్వంలోని కమిటీ అవార్డు గ్రహీతలను ఎంపిక చేసింది.
ఇందిరాగాంధీ జయంతి నేపథ్యంలో 2024, నవంబరు 19న ఈ పురస్కారాన్ని వర్చువల్ విధానంలో బారెన్‌బొయిమ్, అవ్వాద్‌లకు అందచేశారు.