Published on May 1, 2025
Current Affairs
ఇండియా ఓపెన్‌ రిలే
ఇండియా ఓపెన్‌ రిలే

ఇండియా ఓపెన్‌ రిలే పోటీల్లో గుర్విందర్‌ సింగ్, అనిమేశ్, మణికంఠ, అమ్లాన్‌ల కూడిన పురుషుల జట్టు 4×100 రిలేలో జాతీయ రికార్డును సృష్టించింది. 2025, ఏప్రిల్‌ 30న జరిగిన పోటీలో 38.69 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసిన ఈ చతుష్ఠయం.. 15 ఏళ్ల జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. 2010 కామన్వెల్త్‌ క్రీడల సందర్భంగా రెహమతుల్లా, సురేశ్, షమీర్, ఖురేషీలతో కూడిన జట్టు రికార్డు (38.89) నెలకొల్పింది.