కృత్రిమ మేధ (ఏఐ) రంగంపై విస్తృతంగా చర్చించేందుకు, అత్యాధునిక ఆవిష్కరణలపై అవగాహన కల్పించేందుకు భారత్ ఆతిథ్యమిస్తున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో-2026, సమిట్’ 2026, ఫిబ్రవరి 16న దిల్లీలో ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 20 వరకూ భారత్ మండపం, సుష్మా స్వరాజ్ భవన్, అంబేడ్కర్ సెంటర్ వేదికలుగా జరగనున్న ఈ ఎక్స్‌పో, సమిట్‌లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.
ఏఐ ప్రయాణంలో భారత్ ముందు వరుసలో నిలిచిందని, దాని పురోగతి లక్ష్యం, బాధ్యతలను ప్రతిబింబిస్తుందని ఈ సందర్భంగా ఎక్స్‌లో ఆయన ప్రకటించారు.
ఈ సమిట్ థీమ్: సర్వజన హితాయ.. సర్వజన సుఖాయ (అందరి సంక్షేమం).