ఇండియా ఇంపాక్ట్ సమిట్‌ను 2026, ఫిబ్రవరి 19న దిల్లీలోని భారత మండపంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఐ సక్రమ వినియోగానికి ‘మానవ్’ (ఎంఏఎన్‌ఏవీ) విజన్‌ను ఆవిష్కరించారు. ఎం: నైతికత, విలువల వ్యవస్థ (మోరల్ అండ్ ఎథికల్ సిస్టమ్స్); ఎ: జవాబుదారీ పాలన (ఎకౌంటబుల్ గవర్నెన్స్), ఎన్: జాతీయ సార్వభౌమత్వం (నేషనల్ సావర్నిటీ); ఏ: అందుబాటు, సమ్మిళితం (యాక్సెసబుల్, ఇంక్లూజివ్); వీ: చెల్లుబాటు, చట్టబద్ధత (వ్యాలీడ్, లెజిటమేట్).