Published on Dec 12, 2024
Current Affairs
‘ఇండియా ఇన్‌ ఫ్యూచర్‌టెన్స్‌’
‘ఇండియా ఇన్‌ ఫ్యూచర్‌టెన్స్‌’

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 2047 నాటికి వందేళ్లు పూర్తవనున్న నేపథ్యంలో యునైటెడ్‌ నేషన్స్‌ ఫౌండేషన్, కౌన్సిల్‌ ఆఫ్‌ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ వాటర్‌ (సీఈఈడబ్ల్యూ) సంయుక్తంగా రూపొందిస్తున్న నిఘంటువుకు 47 పదాలను గుర్తించారు.

‘ఇండియా ఇన్‌ ఫ్యూచర్‌ టెన్స్‌: 47 వర్డ్స్‌ ఫర్‌ 2047’ పేరుతో రూపొందిస్తున్న నిఘంటువులో బ్లూకార్బన్, కల్చర్నామిక్స్, డిజిటల్‌ నోమడ్, 15 మినిట్‌ సిటీ, ఫ్లాక్స్‌ వంటి 47 పదాలు చోటు దక్కించుకున్నాయి.

భారతావనికి స్వేచ్ఛ లభించి వందేళ్లు పూర్తయ్యే సమయానికి ఎలాంటి పోకడలు ఉంటాయి, దేశ ప్రయాణాన్ని నిర్వచించే విలువలు వంటి అంశాలను ఈ నిఘంటువు గుర్తిస్తుంది.