Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 17, 2026
Government Jobs
ఇండియా ఆప్టెల్ లిమిటెడ్‌లో ఇంజినీర్ ఉద్యోగాలు
ఇండియా ఆప్టెల్ లిమిటెడ్‌లో  ఇంజినీర్ ఉద్యోగాలు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన దెహ్రాదూన్‌లోని ఇండియా ఆప్టెల్ లిమిటెడ్ (ఐఓఎల్‌), ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో జూనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. 

వివరాలు:

జూనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ - 77

విభాగాలు: కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఆప్టిక్స్ & కోటింగ్ తదితర విభాగాలు.

అర్హతలు: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో 60 శాతం మార్కులతో డిప్లొమా,బీఎస్సీ(కెమిస్ట్రీ/ఫిజిక్స్ & మ్యాథ్స్)లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు, మాజీ సైనికులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. 

వేతనం: నెలకు రూ.30,000 నుంచి రూ.1,20,000.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.

చిరునామా: మేనేజర్ (హెచ్ఆర్‌), ఇండియా ఆప్టెల్ లిమిటెడ్, కార్పొరేట్ హెడ్‌క్వార్టర్స్, రాయ్‌పుర్, దెహ్రాదూన్‌ - 248008, ఉత్తర్‌ఖండ్ 

దరఖాస్తు చివరి తేదీ: 03-04-2026

Website:https://ddpdoo.gov.in/career