దేశంలో 2015-24 మధ్య దశాబ్దకాలంలో మలేరియా కేసుల్లో 80 - 85 శాతం తగ్గుదల నమోదైనట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ 2025, డిసెంబరు 24న విడుదల చేసిన ‘ఇండియాస్ ప్రోగ్రెస్ టువర్డ్స్ మలేరియా ఎలిమినేషన్’ నివేదిక వెల్లడించింది. 2015లో 10.17 లక్షలమేర నమోదైన మలేరియా కేసులు 2024 నాటికి 2.27 లక్షలకు తగ్గాయని తెలిపింది. అలాగే మలేరియా సంబంధ మరణాలు కూడా ఇదే తీరులో 384 నుంచి 83కు తగ్గాయి. గతంలో ఎన్నడూలేని విధంగా 2023లో వార్షిక రక్తపరీక్షల రేటు 25 శాతానికి చేరినట్లు తెలిపింది.