2023 అక్టోబరు నుంచి 2024 సెప్టెంబరు వరకు ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా ప్రతి సెకనుకు 11 సైబర్ దాడులు జరిగినట్లు ‘ఇండియా సైబర్ థ్రెట్ రిపోర్ట్-2025’ నివేదిక పేర్కొంది.
2025లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) పరిజ్ఞానంతో కూడిన మాల్‌వేర్‌లతో సైబర్ దాడులు ఎక్కువగా జరిగే అవకాశముందని అంచనా వేసింది.
డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (డీఎస్‌సీఐ), సెక్‌రైట్ అనే సంస్థ ఇటీవల ఈ నివేదికను విడుదల చేసింది.
దేశవ్యాప్తంగా 84 లక్షల ఎండ్‌పాయింట్ల (నేరం జరిగినట్లు గుర్తించిన కేంద్రం)లో 36.9 కోట్ల మాల్‌వేర్లతో దాడులు జరిగినట్లు గుర్తించారు.
హెల్త్‌కేర్ (21.82%), ఆతిథ్యం (19.57%), బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్- బీఎఫ్‌ఎస్‌ఐ (17.38%), ఎడ్యుకేషన్ (15.64%), ఎంఎస్‌ఎంఈ (7.52%), మాన్యుఫ్యాక్చరింగ్ (6.88%), ప్రభుత్వ సంస్థలు (6.1%), ఐటీ/ఐటీఈఎస్ (5.09%) రంగాలు దాడులకు గురయ్యాయి.