ఇండియన్ రైల్వేస్ చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ రైల్వే స్కూల్ డీవీ(గర్ల్స్), డీవీ(బాయ్స్)లో ఒప్పంద ప్రాతిపదికన టీచర్ పోస్టుల భర్తీకీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 37
వివరాలు:
1. పీజీటీ: 21
2. టీజీటీ: 16
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ, బీఈడీ, బీఈ, బీటెక్, డిగ్రీ, డీఎడ్, ఎంఈడీలో ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 20-03-2025 తేదీ నాటికి 18 - 65 ఏళ్లలోపు ఉండాలి.
జీతం: నెలకు పీజీటీ పోస్టుకు రూ.27,500, టీజీటీ పోస్టుకు రూ.26,250.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 5, 7, 8, 9, 11, 12
వేదిక: మీటింగ్ రూమ్/జీఎం ఆఫీస్ బిల్డింగ్/ సీఎల్‌డబ్ల్యూ/సీఆర్‌జే.