Published on Mar 21, 2025
Government Jobs
ఇండియన్‌ రేర్‌ ఎర్త్స్‌ లిమిటెడ్‌లో పోస్టులు
ఇండియన్‌ రేర్‌ ఎర్త్స్‌ లిమిటెడ్‌లో పోస్టులు

ఇండియన్‌ రేర్‌ ఎర్త్స్‌ లిమిటెడ్ (ఐఆర్‌ఈఎల్‌), ముంబయి వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 30

వివరాలు:

1. జనరల్ మేనేజర్‌(ఫైనాన్స్‌): 01

2. డిప్యూటీ జనరల్ మేనేజర్‌(ఫైనాన్స్‌): 01

3. చీఫ్‌ మేనేజర్‌(ఫైనాన్స్‌): 01

4. సీనియర్‌ మేనేజర్‌(ఫైనాన్స్‌): 01

5. అసిస్టెంట్ మేనేజర్‌(ఫైనాన్స్‌): 02

6. డిప్యూటీ జనరల్ మేనేజర్‌(హెచ్‌ఆర్‌ఎం): 01

7. చీఫ్‌ మేనేజర్‌(హెచ్‌ఆర్‌ఎం): 01

8. అసిస్టెంట్ మేనేజర్‌(హెచ్‌ఆర్‌ఎం): 02

9. అసిస్టెంట్ మేనేజర్‌(రాజ్‌భాష): 02

10. డిప్యూటీ జనరల్ మేనేజర్‌(బిజినెస్‌ డెవలప్‌మెంట్ ): 01

11. డిప్యూటీ మేనేజర్‌ (మార్కెటింగ్): 02 

12. చీఫ్‌ మేనేజర్‌(సివిల్): 01

13. మేనేజర్‌(సివిల్): 03

14. డిప్యూటీ మేనేజర్‌(సివిల్): 01

15. డిప్యూటీ జనరల్ మేనేజర్‌(టెక్నికల్): 01

16. డిప్యూటీ జనరల్ మేనేజర్‌(కమర్షియల్): 01

17. డిప్యూటీ జనరల్ మేనేజర్‌( ప్రాజెక్ట్స్‌): 01

18. చీఫ్‌ మేనేజర్‌(ప్రాజెక్ట్స్‌): 01

19. చీఫ్‌ మేనేజర్‌(కమర్షియల్‌): 01

20. మేనేజర్‌(ఎలక్ట్రికల్): 03

21. మేనేజర్‌(మెకానికల్): 01

22. డిప్యూటీ మేనేజర్‌(మినరల్): 01

విభాగాలు: ఫైనాన్స్‌, హెచ్‌ఆర్‌ఎం, రాజ్‌భాష, బిజినెస్‌ డెవలప్‌మెంట్ & మార్కెటింగ్, సివిల్, టెక్నికల్,

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ, సీఎంఏ, ఎంబీఏ, బీకాం, ఎంఏ, ఎంఎస్‌డబ్ల్యూ, మాస్టర్స్‌ డిగ్రీ, బీఈ, బీటెక్‌, బీఎస్సీ, ఎంఎస్సీ, ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: జనరల్ మేనేజర్‌కు 50 ఏళ్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు 46 ఏళ్లు, చీఫ్‌ మేనేజర్‌కు 42 ఏళ్లు, సీనియర్‌ మేనేజర్‌కు 38 ఏళ్లు, అసిస్టెంట్ మేనేజర్‌కు 28 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

జీతం: నెలకు జనరల్ మేనేజర్‌కు రూ.1,00,000 - రూ.2,60,000, డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు రూ.90,000 - రూ.2,40,000, చీఫ్‌ మేనేజర్‌కు రూ.80,000 - రూ.2,20,000, సీనియర్‌ మేనేజర్‌కు రూ.70,000 - రూ.2,00,000, అసిస్టెంట్ మేనేజర్‌కు రూ.40,000 - రూ.1,40,000.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ 500; ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 10-04-2025.

Website:https://irel.co.in/careers