Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 6, 2026
Apprenticeship
ఇండియన్‌ రేర్‌ ఎర్త్స్‌ లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్‌ రేర్‌ ఎర్త్స్‌ లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టులు

కేరళలోని చవరాలో ఉన్న ఐఆర్ఈఎల్ (ఇండియా) లిమిటెడ్ (ఐఆర్‌ఈఎల్‌), 2025-26 సంవత్సరానికి గాను వివిధ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ పౌరుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. 

వివరాలు:

ట్రేడ్‌/టెక్నీషియన్‌/గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్: 72

విద్యార్హతలు:

ట్రేడ్ అప్రెంటిస్: సంబంధిత ట్రేడ్‌లో (ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, ప్లంబర్ మొదలైనవి) ఐటీఐ (ITI) ఉత్తీర్ణత లేదా ఎం.ఎస్సీ (కెమిస్ట్రీ)లో ఉత్తీర్ణులై ఉండాలి.

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ లేదా మైనింగ్ విభాగాల్లో బి.టెక్/బి.ఇ (B.Tech/BE)లో ఉత్తీర్ణత ఉండాలి.

టెక్నీషియన్ అప్రెంటిస్: మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ లేదా మైనింగ్ విభాగాల్లో డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.

జనరల్ స్ట్రీమ్ (ఎగ్జిక్యూటివ్): బి.కాం (B.Com), బి.ఏ (BA), బి.బి.ఏ (BBA), లేదా బి.ఎస్సీ (B.Sc/ B.Sc Geology).

గమనిక: డిస్టెన్స్ లెర్నింగ్ లేదా పార్ట్ టైమ్ ద్వారా అర్హత పొందిన వారు అనర్హులు.

వయోపరిమితి (28-03-2025 నాటికి):

కనీసం 18 ఏళ్లు, గరిష్టంగా 25 ఏళ్లు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీ (NCL) అభ్యర్థులకు 3 ఏళ్లు, దివ్యాంగులకు (PWD) 10 ఏళ్ల వరకు వయో సడలింపు ఉంటుంది.

జీతం (స్టైపెండ్):

అప్రెంటిస్‌షిప్ రూల్స్, 1992 ప్రకారం ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్ణయించిన రేట్ల ప్రకారం స్టైపెండ్ చెల్లించబడుతుంది.

ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులు నిర్ణీత విద్యార్హతలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు.

మెరిట్ జాబితాలో ఉన్న వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు.

ఎంపికలో భూనిర్వాసితులు, స్థానిక గ్రామాల వారు & కొల్లాం జిల్లా/కేరళ రాష్ట్ర అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.

దరఖాస్తు విధానం:

అభ్యర్థులు ముందుగా సంబంధిత ప్రభుత్వ పోర్టల్స్‌లో (MSDE/NATS) నమోదు చేసుకోవాలి.

పోర్టల్‌లో దరఖాస్తు చేసిన తర్వాత, నోటిఫికేషన్‌లో ఇచ్చిన నిర్ణీత ఫారమ్‌ను (Annexure A) పూర్తి చేసి, అవసరమైన ధృవీకరణ పత్రాల జిరాక్స్ కాపీలను జత చేసి పోస్ట్ ద్వారా పంపాలి.

చిరునామా: The DGM (HRM), IREL (India) Limited, Chavara, Kollam District, Kerala - 691583.

దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ: 28-03-2025.

Website:https://irel.co.in/careers